ఉప్పు చేసే మేలు..

మనం చేస్తున్న ఘోరమైన
ఉప్పు తప్పు…

స్వానుభవంతో చెబుతున్నా
రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి
అయోజైజ్డ్ సన్నఉప్పును 20/-
పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి

మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే
మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు🖱

అప్పట్లో బీపీలు లేవు,
వోంట్లో ఎముకల నోప్పులు లేవు
థైరాయిడ్ సమస్యల్లేవు…

మీకు గుర్తుందా..?
ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు బస్తాలు జస్ట్, అలా వదిలేస్తారు
ఎందుకంటే ఉప్పును ఎవరూ దోంగతనం చేయరు

ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా ఉండేది

ఆ రోజులు పోయాయి…
అంతా సన్న ఉప్పు,
అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా జొరబడింది…

దొడ్డు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ
దీన్నే ప్రిఫర్ చేయసాగారు…

కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది…

ఏళ్లకేళ్లు మనకేమీ పట్టడం లేదు

అదెలా స్టార్టయిందంటే..?

1986 ప్రాంతంలో…
కార్పోరేట్లు సర్కారును అప్రోచయ్యారు…

ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు కాబట్టి,
వారికి అయోడిన్ కలిపిన ఉప్పును అలవాటు చేస్తే ఆరోగ్యవంతులైపోతారు అని చెప్పారు…

అధ్యయనాలు లేవు, ముందు జాగ్రత్తలు లేవు, మరి కార్పోరేట్లు కదా…
సర్కారు వోకే అనేసింది…
🖱
అయోడైజ్డు ఉప్పు వాడాలి అంటూ సముద్రపు ఉప్పును నిషేధించి పారేసింది…

ఈశాన్య రాష్ట్రాల్లో అయోడిన్ లోపం ఉంటే, మరి మిగతా దేశం మొత్తానికీ
ఈ నిర్బంధ లవణం దేనికి
అని అడిగినవాడు లేడు…

రోగి కి చెప్పాల్సిన ప్రిక్షిప్షన్ దేశమంతా ఎందుకు వాడాలి
అని అడిగిన వాడు లేడు

మరి కార్పొరేటు లాబీయింగు అలాగే ఉంటుంది…

కార్పోరేట్లు పెద్ద ఎత్తున కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ ఉప్పు తయారీ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు… మామూలు ఉప్పుకి నాలుగైదు రెట్లు ధర ఎక్కువ…

చివరకు ప్రజల కూడు నుంచి
చౌక ఉప్పును కూడా కాజేసిన దొంగలు…

తరువాత
అనేక కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు…

ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడిందీ అంటే సముద్రపు ఉప్పు ప్రమాదకరం, అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి…
🖱
మెల్లిమెల్లిగా దీని దుష్ప్రభావాలు అర్థం కాసాగాయి…
ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన సైనైడ్ అంశాలుంటయ్…

అవి
1) E535 – sodium ferrocyanide,
2) E536 – potassium ferrocyanide,
3) E538 – calcium ferrocyanide…
మరికొన్నీ అనారోగ్య హేతువులుంటయ్…

ఇవి బీపీలను పెంచినయ్… థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని పెంచినయ్…
గుండె జబ్బుల్ని పెంచినయ్…

డయాగ్నయిజ్ లేబరేటరీలు హేపీ, మందుల కంపెనీలు హేపీ, డాక్టర్లు హేపీ…

విధి లేక ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు సైంధవ లవణాన్ని సూచించసాగారు…

కానీ ధర ఎక్కువ…
ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ…

ఇప్పటికీ కిచెన్లలో సైంధవ లవణం లేదా సముద్రపు సహజలవణం మంచిది

నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు…

కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్‌ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం…

దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టవుతున్నది

అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, నివారణ చర్యల్లో పడ్డయ్

మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ సముద్రపు ఉప్పు అమ్మడం స్టార్టయింది…

పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ… మరేం చేస్తాం..?
కానీ రూల్స్ అలాగే ఉన్నయ్…

దీనిమీద గత ఏడాది కర్నాటక హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది

మరి జనం ఏం చేయాలి..?
ఏముందీ..?
ఆ దిక్కుమాలిన ఉప్పును తగ్గించేసి, వీలైనంతవరకూ దొడ్డు ఉప్పు అనగా సముద్రపు ఉప్పు, సహజలవణం వైపు మళ్లడం బెటర్…
🖱
మార్కెట్‌లో బాగానే దొరుకుతున్నది ఇప్పుడు…

అయితే నెట్‌లో వెబ్‌సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్…
ఏమనీ అంటే..?
ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని

తప్పు, అలాంటి వాటి జోలికి పోవద్దు… ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది… సైంధవ లవణం అయితే మరీ మేలు

ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం… అది రక్తపోటుకు మంచిది కాదు… అందుకని ఆ వెబ్ డాక్టర్ల జోలికి పోకుండా,

జస్ట్, వంటలకు తగినంత… వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్…

ఉప్పు కేవలం రుచి కోసమే… ఆరోగ్యం కోసం కాదు…
మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది…

వాటికి, వారికి ఈ దేశం ఉప్పు తింటున్నామనే విశ్వాసం కూడా ఉండదు కదా 🗞

అందుకని బీ కేర్ ఫుల్
ఈ ప్రభుత్వాలు మనల్ని ఏమీ ఉద్ధరించవు…
మరి పార్టీలకు, నాయకులకు కార్పొరేటు కంపెనీలు డబ్బులిస్తాయి తప్ప జనం ఇవ్వరు కదా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s