Today trending news


రాష్ట్రాలు కొవిడ్​ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలను చేపట్టాలని కోరింది.


ట్రాఫిక్ చలానా కింద మంగళసూత్రాన్నిచ్చిన మహిళ

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులకు ఓ మహిళ తన మంగళసూత్రాన్ని జరిమానా కింద ఇవ్వడం సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో కర్ణాటకలో 30 ఏళ్ల మహిళ ట్రాఫిక్ పోలీసులకు తన మంగళసూత్రాన్ని ఇచ్చింది. ఈ దంపతులు ఇద్దరు సిటీ మార్కెట్‌లో మంచం కొనుగోలు చేసేందుకు రూ.1800 తమ వెంట తీసుకెళ్లారు. మార్కెట్‌లో రూ. 1700 విలువైన మంచాన్ని వారు కొనుగోలు చేశారు.
ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. అల్పాహారం కోసం తమ దగ్గరున్న చివరి రూ. 100 కూడా ఖర్చు చేశామని, అయినా పోలీసులు పట్టుబట్టారని వాపోయారు. చివరికి చేసేది లేక.. తన దగ్గరున్న మంగళసూత్రాన్ని వారికిచ్చినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించ లేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జమ్ము కశ్మీర్ ఉధంపుర్​లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్​ నుంచి ఓ జవాను డేటాను తస్కరించాడు. దీన్ని పాకిస్థాన్​కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులకు అందజేశాడు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సమాచారం భారీ స్థాయిలో చోరీ కాకపోవచ్చని ఓ అధికారి పేర్కొన్నారు.


ఒక్కొక్కరికీ రూ.లక్ష ఇచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభుత్వం

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ శనివారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సెనేట్‌లో కూడా గట్టెక్కితే అమెరికన్ల అకౌంట్లలోకి 1,400 డాలర్లు వచ్చి పడనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి పంజా విసరడంతో అమెరికాలో కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లకు అమెరికా ప్రతినిధుల సభ శనివారం రోజు పచ్చ జెండా ఊపింది. 219-212 ఓట్ల తేడాతో దిగువ సభ(ప్రతినిధుల సభ)లో ఈ బిల్లు గట్టెక్కింది. మొదటి నుంచి ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు.. సభలో ఈ బిల్లుకు మద్దతు తెలపలేదు. వీరితోపాటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా చదువును మరింత చేరువ చేసేందుకు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సంస్థ‌ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అమెరికన్‌ కార్నర్‌ పేరుతో ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తృతం చేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌తో ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఒప్పందం చేసుకుంది.


సామాజిక మాధ్యమాలపై ఇటీవల ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది. 50లక్షల లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సామాజిక మాధ్యమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. దీని ప్రకారం సంబంధిత సంస్థలు చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్​, నోడల్​, రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్​ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతకర పోస్టులపైన వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి.పోస్టులపై ప్రభుత్వం లేదా కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత పోస్టులను 36 గంటల్లోగా తొలగించాలి. పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదు అందితే సంస్థలు వాటిని 24 గంటల్లోగా తొలగించాలి.తప్పుడు సమాచారాన్ని మొదట ప్రారంభించిన వారి వివరాలను కోర్టు లేదా ప్రభుత్వాలు కోరితే.. వాటిని అందించాలి.*


అంబా‌సిడ‌ర్ కంపెనీ ఫ‌ర్ సేల్‌!

న్యూఢిల్లీ: ఒక‌ప్పుడు అంబాసిడ‌ర్ అఫిషియ‌ల్‌.. ఆ కారు ఎమ్మెల్యేలు.. ప్ర‌భుత్వాధికారుల వ‌ద్ద ఉండేది.. కాల క్ర‌మేణా టెక్నాల‌జీ పెరిగి ర‌క‌ర‌కాల అధునాత‌న మోడ‌ల్ కార్లు వ‌చ్చినా.. భ‌ద్ర‌తా ప‌రంగా అంబాసిడ‌ర్ సేఫ్‌. అంబాసిడర్ సీఎన్జీ, ఎల్పీజీ వేరియంట్లలోనూ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.. దీనికితోడు గోటిపై రోక‌టి పోటు అన్న చందంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో హిందూస్థాన్ మోటార్స్ క‌కావిక‌ల‌మైంది. సిబ్బంది వేత‌నాలివ్వ‌లేక విల‌విల్లాడుతున్న‌ది…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s