“అయోధ్య” కార్యానికి రెట్టింపు స్పందన.

“అయోధ్య రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడి స్వప్నం.. ఇది కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలది మాత్రమే కాదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ శ్రీ దేవేందర్ జి అన్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో లక్ష్యానికి రెట్టింపు స్థాయిలో నిధులు సమకూరడమే ఇందుకు సాక్షాత్కారం అని వారు పేర్కొన్నారు. జనవరి 15 వ తేదీ ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణ అభియాన్ కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ముగిసింది. ఈ సందర్భంగా మార్చి ఒకటవ తేదీన భాగ్యనగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో ” శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్” సమావేశం నిర్వహించింది. ఇందులో దేవేందర్ జి మాట్లాడుతూ.. ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన విశ్వహిందూ పరిషత్ నిధుల సేకరణ ప్రారంభానికి ముందు మందిర నిర్మాణానికి పదకొండు వందల కోట్లు ప్రజల నుంచి సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకుందని, కానీ ప్రజల నుంచి, రామభక్తుల నుంచి అనూహ్య స్పందన లభించి.. రెట్టింపు స్థాయిలో నిధులు సమకూరాయి అని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలను రామ భక్తులు స్వచ్ఛందంగా ట్రస్టుకు అందజేశారని చెప్పారు. కార్యకర్తలు గడపగడపకు వెళ్లి చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా.. పేద ధనిక భేదం పాటించకుండా స్వచ్ఛందంగా నిధులను సేకరించినట్లు వివరించారు. మరికొంతమంది మందిర నిర్మాణ ట్రస్టుకు ఆన్లైన్లో నిధులు అందజేయడం సంతోషకరమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి మందిర నిర్మాణానికి
180 కోట్ల రూపాయల సమర్పణ: రమేష్ జి

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మందిర నిర్మాణానికి దాదాపు 180 కోట్ల రూపాయలు సమకూర్చినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బండారి రమేష్ గారు తెలియజేశారు. రాష్ట్రంలోని 13014 గ్రామాల్లో.. దాదాపు 80 లక్షల ఇళ్లకు వెళ్లి రామమందిర ఆవశ్యకతను కార్యకర్తలు వివరించారని చెప్పారు. మొత్తంగా లక్షా 70 వేల మంది కార్యకర్తలు నిధి సేకరణ లో భాగస్వాములు కావడం విశేషమని వారు పేర్కొన్నారు. నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొని సేవలు అందించిన వారికి కాషాయపు కండువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం నిధి సేకరణ కోసం ఏర్పాటు చేసిన అభియాన్ కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించారు.

భారత పరిపాలనా వ్యవస్థలో అయోధ్య అంతర్భాగం కావాలి: ఎల్ వి సుబ్రహ్మణ్యం

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశ చరిత్ర మారబోతుందని .. అయోధ్య కేంద్రంగా భారత దేశ పరిపాలన సాగాలని .. భారత పరిపాలన వ్యవస్థలో అయోధ్య అంతర్భాగం కావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి (Retired chief Secretery,రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ) శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు అభిప్రాయపడ్డారు. మందిర నిర్మాణం తో దేశ చరిత్ర మారిపోతుందని.. ప్రపంచ స్థాయి లోనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించి, గౌరవం పెరిగిపోతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. భారత వ్యవస్థలో లౌకికత్వం పేరుతో హిందూ సమాజం పై దాడి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు హిందుత్వాన్ని బలంగా చెప్పుకోలేక పోతున్నారని.. అడుగడుగున వివక్షకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇంట్లో పూజలు చేసినా బయట భక్తిభావం ప్రదర్శించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ మూలాల్లోకి వెళ్లి పని చేయాలి: సత్యం జి

దాదాపు ఐదు శతాబ్దాల పాటు పోరాడి రామ జన్మభూమి లో భవ్యమైన మందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్న మనము.. ఇక హిందూ మూలాల ఆధారంగా పని చేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సహ కార్యదర్శి శ్రీ గుమ్మల్ల సత్యం జి పిలుపునిచ్చారు. హిందూ సంస్కారాల ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. హిందుత్వ మూలాలు విస్మరించడం వల్లనే ధర్మానికి ఇబ్బందులు పచ్చి పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు “సామాజిక సమరసత “కార్యక్రమాలతోపాటు, వివిధ కారణాల వల్ల మతం వారిని తిరిగి స్వధర్మం లోకి తీసుకు వచ్చే “ఘర్ వాపసీ” కార్యక్రమాలపై కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ రాజు గారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత సహ కార్యవాహ శ్రీ శ్రీధర్ జి, శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ అధ్యక్షులు శ్రీ వీసం శెట్టి విద్యాసాగర్ గారు, కోశాధికారి శ్రీ అశోక్ బర్మేచా గారు, శ్రీ అశ్విని సుబ్బారావు గారు, మరియు అభియాన్ కమిటీ తో పాటు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు సమావేశంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలు చెప్పారు. అదే విధంగా పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s