పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్..

Drones used by police
Drone

టెక్నాలజీని వాడడంలో అందరి కంటే ముందున్న తెలంగాణ పోలీసులు మరోసారి టెక్నాలజీ సాయంతో పోలిసింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

ప్రమాదాలు, దాడులు, ఘర్షణలు వంటి ఘటనలు జరిగినప్పుడు సంఘటనా స్థలానికి నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు అత్యాధునిక కెమెరాలు, లైటింగ్, స్పీకర్లతో జీపీఎస్ ఆధారంగా పని చేసే డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు.

ఈ డ్రోన్లు సంఘటనా స్థలం లోని పరిస్థితులను క్షణాల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తుంది.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచనల మేరకు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

పోలీస్‌ విధుల్లో ఘటనా స్థలానికి ఫస్ట్‌ రెస్పాండర్స్‌గా డ్రోన్లను పంపే వీలును పరిశీలించాలి.

ఎవరైనా మహిళ ఆపదలో ఉండి ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రదేశానికి డ్రోన్లను పంపి.. కెమెరాల ద్వారా నేరస్థుల కదలికలపై నిఘా పెట్టవచ్చు.

పోలీస్‌ సైరన్‌ తో డ్రోన్‌ కనిపిస్తే నేరస్థులను కట్టడి చేయవచ్చు.. అని మంత్రి కేటీఆర్‌ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

ఈ అంశంపై దృష్టి పెట్టిన పోలీసు అధికారులు మొదట సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు.

ఇప్పటికే టెస్ట్‌ డ్రైవ్‌ ప్రారంభించారు.

ఈ డ్రోన్లు ప్రత్యేకం
ప్రతి డ్రోన్‌ కు పోలీస్‌ సైరన్‌, ప్రత్యేక లైట్లు, అత్యాధునిక కెమెరాలను అమరుస్తారు.

లొకేషన్‌ సమాచారం అందగానే జీపీఎస్‌ సాయంతో అక్కడికి నిమిషాల్లో చేరిపోయి ఆటోమెటిక్‌గా పని చేస్తాయి.

ఒక్కో డ్రోన్‌ మూడు కిలో మీటర్ల నుంచి ఐదు కిలో మీటర్ల పరిధిని కవర్‌ చేస్తుంది.

పగలు, రాత్రి వేళల్లో కెమెరాల సామర్థ్యం, క్రైం స్పాట్‌ కు చేరడంలో డ్రోన్లకు ఎదురవుతున్న అవరోధాలు, స్పాట్‌ లోని వ్యక్తులకు పోలీసులు ఇచ్చే సూచనలు వినిపించేలా స్పీకర్ల సామర్థ్యాన్ని పెంచడం తదితర అంశాలను పరీక్షిస్తున్నట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

ఎవరైనా డ్రోన్లను రాళ్లతో కొట్టి పాడు చేయకుండా వాటిని ఎంత ఎత్తులో ఆపరేట్‌ చేయాలన్న అంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు.

ఉపయోగం ఏంటంటే..
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం, నేరం జరిగినట్టు డయల్‌ 100, హాక్‌ ఐ లేదా మరే రూపంలో నైనా పోలీసులకు సమాచారం చేరితే వెంటనే ఆ ప్రదేశాన్ని లొకేషన్‌ బేస్డ్‌ సర్వీస్‌ ద్వారా గుర్తించి డ్రోన్లకు పంపుతారు.

పోలీసులు వాహనాల్లో చేరుకోవడానికి కొన్ని సార్లు సమయం పట్టవచ్చు. కానీ, గాల్లో వెళ్లే డ్రోన్లు ఎలాంటి అవరోధాలు లేకుండా చేరతాయి.

ఘటనా స్థలంలో పరిస్థితిని వీడియోలు, ఫొటోల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు క్షణాల్లో చేర వేస్తాయి.

దాంతో పరిస్థితిని అంచనా వేసి అవసరం మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసే వీలు కలుగుతుంది.

అదే విధంగా డ్రోన్లకు ఉండే పోలీస్‌ సైరన్‌తో నేరస్తుడికి పోలీసులు వస్తున్నారన్న భయం కలుగుతుంది.

బాధితులకు ధైర్యం వస్తుంది. స్పీకర్ల ద్వారా పోలీసులు నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పవచ్చు.

క్రైం సీన్‌ ను బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ తదితర విభాగాలను అలర్ట్‌ చేసే వీలుంటుంది..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s