అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును ప్రణాళిక చేసిన వండర్‌లా హైదరాబాద్‌

హైదరాబాద్‌, మార్చి 02,2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తమ థీమ్‌ పార్క్‌ వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజును వండర్‌లా హైదరాబాద్‌ వెల్లడించింది. వండర్‌లా ఇప్పుడు ప్రత్యేక వన్‌+వన్‌ ఆఫర్‌ను ప్రవేశ టిక్కెట్‌ పై అందిస్తుంది. ఈ టిక్కెట్‌ ధర జీఎస్‌టీ పన్నులతో సహా కలుపుకుని 999 రూపాయలు. ఈ థీమ్‌ పార్క్‌ వద్ద ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా మహిళలు తమ మహిళా గ్యాంగ్‌తో కలిసి గడపడంతో పాటుగా ప్రపంచ శ్రేణి రైడ్స్‌ మరియు ఆకర్షణలను వండర్‌లా వద్ద ఆస్వాదించవచ్చు. మనందరికీ అత్యంత భారంగా గడిచిన సంవత్సరం ముగిసిన వేళ, పునరుత్తేజం పొందేందుకు ఈ సాహసోపేత గేట్‌వే ఓ చక్కటి మార్గం.
మార్చి 08వ తేదీన ఈ థీమ్‌ పార్క్‌ వద్ద 10 సంవత్సరాలు దాటిన పురుష సందర్శకులను అసలు అనుమతించరు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌ బుకింగ్స్‌తో పాటుగా వాక్‌ ఇన్స్‌ కు కూడా వర్తింపజేశారు. కేవలం మహిళా సందర్శకులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. మార్చి08వ తేదీ కోసం ఇప్పటికే ఎవరైనా పురుషులు బుక్‌ చేసుకుని ఉంటే అది ఆ రోజు రద్దు చేయడం జరుగుతుంది.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను వండర్‌లా హైదరాబాద్‌ అనుసరిస్తుంది. కంపెనీ యొక్క పరిశుభ్రత మరియు భద్రతా పాలసీలో భాగంగా, రైడ్స్‌, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలు మరియు కియోస్క్‌ల వద్ద భౌతిక దూరం పాటించేలా అతిథులకు భరోసా కల్పిస్తూ ఫ్లోర్స్‌కు మార్కింగ్‌ చేయడం జరిగింది. అందరూ వినియోగించే ప్రాంగణాలను ప్రతి రోజూ హైపోక్లోరైట్‌ ద్రావకంతో శానిటైజ్‌ చేయడంతో పాటుగా అనుమతించిన రసాయనాలతో రైడ్స్‌ను శానిటైజ్‌ చేస్తున్నారు. వండర్‌లా వద్ద సిబ్బంది మొత్తం మాస్కులను ధరించడంతో పాటుగా అన్ని రైడ్స్‌, రెస్టారెంట్లు, ఛేంజింగ్‌ రూమ్స్‌ మరియు ఇతర ప్రవేశ ద్వారాల వద్ద ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. మాస్కులు, గ్లోవ్స్‌, హ్యాండ్‌ టిష్యూలను పారవేయడం కోసం ప్రత్యేకంగా బిన్‌లను ఏర్పాటుచేయడం జరిగింది. నీటిలో క్లోరిన్‌ స్ధాయిని సరిగా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌ కెమికల్‌ డోసింగ్‌ను పర్యవేక్షించడం ద్వారా తగినంతగా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చేస్తున్నామనే భరోసానూ అందిస్తున్నారు.
వండర్‌లా హైదరాబాద్‌ను వారంలో ఏడు రోజులూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచి ఉంచుతారు. మార్గదర్శకాలను అనుసరించడంతో పాటుగా అత్యుత్తమ ప్రక్రియలను అనుసరించడం కోసం సందర్శకులు ముందుగానే తమ ప్రవేశ టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సిందిగా వండర్‌లా ప్రోత్సహిస్తుంది. ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌ బుకింగ్‌ పోర్టల్‌ bookings.wonderla.com వద్ద పొందవచ్చు. మరింత సమాచారం కోసం http://www.wonderla.com చూడవచ్చు లేదా 040 2349 0333కు కాల్‌ చేయవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s