అనంతపురం నగరంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్..మున్సిపల్ ఎన్నికల వేళ భరోసా కల్పిస్తూ సాగిన కవాతు.

అనంతపురం మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసు సిబ్బంది, పోలీసు బలగాలు భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్ నగరంలో ఈ రోజు నిర్వహించారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఆదేశాలతో స్థానిక పోలీస్ పరేడ్ మైదానం నుండి కోర్టురోడ్డు, క్లాక్ టవర్ , సుభాష్ రోడ్డు , సప్తగిరి సర్కిల్ , అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఈ ఫ్లాగ్ మార్చ్ జిల్లా పోలీసు కార్యాలయం చేరుకుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తూ ఈ కవాతు కొనసాగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ లో వజ్ర వాహనం ప్రదర్శనగా తీసికెళ్లారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డీఎస్పీ జి. వీర రాఘవ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్ , అనంతపురం నగర సిఐలు ప్రతాపరెడ్డి , జాకీర్ హుస్సేన్ ,రెడ్డప్ప , కత్తి శ్రీనివాసులు… ఆర్ ఐ లు శ్రీశైలరెడ్డి, నారాయణ, శివరాముడు, పలువురు ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…

Poloce flagmarch

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s