మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద టెలికామ్‌ టవర్‌ను ఏర్పాటుచేసిన ఇండస్‌ టవర్స్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద తమ టెలికామ్‌ టవర్‌ను ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ టెలికామ్‌ టవర్‌ను మహిళా ఇన్‌స్పెక్టర్‌ Ms మంజుల ప్రారంభించారు.
ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణా సర్కిల్‌ సీఈవో గంటా దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టు పక్కల ప్రాంతాల వాసులకు ఎలాంటి అసౌకర్యమూ లేని కనెక్టివిటీని అందించే అవకాశం అందించిన పోలీస్‌ కమిషనర్‌కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనే మాట్లాడుతూ ‘‘తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వ్యాపారాలు మరియు పరిపాలనా వ్యవస్ధను అనుసంధానం చేస్తోన్న 6వేల కు పైగా టవర్లు కలిగిన ఇండస్‌ టవర్ల నెట్‌వర్క్‌లో సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన ఈ నూతన మొబైల్‌ టవర్‌ భాగం కానుంది. వినియోగదారుల వృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే రీతిలో రాష్ట్రంలో టెలికామ్‌ మౌలిక వసతుల నిర్మాణానికి కంపెనీ కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌ మరియు ఇండస్‌ టవర్ల సమ్మేళనంతో ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌ ఏర్పడింది. ఈ సమ్మిళిత శక్తితో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికామ్‌ టవర్‌ కంపెనీలలో ఒకటిగా ఇండస్‌ను నిలిపింది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజల కమ్యూనికేషన్‌ను సాధ్యం చేస్తోన్న ఇండస్‌, స్థిరంగా అందుబాటు ధరలలో, అత్యంత నాణ్యత కలిగిన, ఆధారపడతగిన సేవలను భారతదేశంలో వృద్ధి చెందుతున్న నెట్‌వర్క్‌ కనెక్టివిటీ అవసరాల కోసం అందిస్తుంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచడంతో పాటుగా దేశవ్యాప్తంగా జీవితాలను కనెక్ట్‌ చేయాలనే తమ నమ్మకానికి కంపెనీ కట్టుబడి ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s