బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. కుటుంబ పెద్దలదే గురుతర బాధ్యత

హెచ్ఎండిఏ మహిళా దినోత్సవం సమావేశంలో సెక్రెటరీ సంతోష్​

Hmda

బాలికలు ఉన్నత విద్యావంతులైతే ఒక తరం అంతా విద్యావంతులు అయ్యే అవకాశం కలుగుతుందని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) సెక్రెటరీ బి.ఎం.సంతోష్ ఐఏఎస్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్స్లోని పార్టీ జోన్ప్రాంగణంలో హెచ్ఎండిఏ మహిళలు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా బి.ఎం.సంతోష్​ మాట్లాడుతూ కుటుంబ పెద్దలు మగ, ఆడ సంతానాన్ని సమానంగా చూడడం, వారికి సమాన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమసమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

హెచ్ఎండిఏలో మహిళా ఉద్యోగులు విధి నిర్వహణలో ముందుండడం సంతోషకరమన్నారు. కార్యక్రమాలను చక్కగా నిర్వహించిన మహిళా ఉద్యోగులు వెంకటలక్ష్మి, సాజిద్​ ఉన్నీసా, ఉమా లను సెక్రెటరీ సంతోష్​ అభినందించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు హెచ్ఎండిఏ కార్యదర్శి సంతోష్​, ఓఎస్డీ రాంకిషన్​ బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో హెచ్ఎండిఏ లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్, సూపరింటెండెంటింగ్ ఇంజినీర్ పరంజ్యోతి, ఓఆర్ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అపర్ణ, తహసీల్దార్ ముంతాజ్, చీఫ్ అంకౌంట్స్ ఆఫీసర్ శరత్ చంద్ర, ఓఎస్డీ ఎం.రాంకిషన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, హెచ్ఎండిఏ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s