సామ్సంగ్ ఇనొవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకున్న సామ్సంగ్;

సామ్సంగ్ ఆర్ అండ్ డి ఇనిస్టిట్యూట్, నోయిడాలోని ఇంజనీర్లు డిటియు విద్యార్ధులు మరియు బోధనాసిబ్బందితో సహకారాత్మక పరిశోధనా ప్రాజెక్టుల పై పని చేస్తారు

భారతదేశం – మార్చ్ , 2021 – తాజా విజన్ #PoweringDigitalIndiaలో అంతర్భాగమైన ప్రభుత్వం వారి స్కిల్ ఇండియా కార్యక్రమం పట్ల తమ నిబద్ధతను పటిష్టం చేస్తూ, సామ్సంగ్ ఇనొవేషన్ క్యాంపస్ కార్యక్రమం క్రింద ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డిటియు) వద్ద సామ్సంగ్ ఇండియా వారు ఒక సామ్సంగ్ ఇనొవేషన్ ల్యాబ్ ప్రారంభించారు.

ల్యాబ్‌లో, డిటియు విద్యార్ధులు మరియు బోధనాసిబ్బంది, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ విషయంలోనూ, అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్, మల్టీమీడియా, ఆరోగ్యం మరియు భద్రత వంటి రంగాల్లో సంయుక్త పరిశోధనా సహకారం కోసం కూడా కృషి చేసి, విద్యార్ధులను పరిశ్రమ కోసం సిద్ధం చేయటం జరుగుతుంది.

దీనిని చేర్చటంతో సామ్‌సంగ్‌కు ఇప్పుడు, గతంలో సామ్సంగ్ డిజిటల్ అకాడమీగా పిలువబడిన సామ్సంగ్ ఇనొవేషన్ క్యాంపస్ కార్యక్రమం క్రింద ఎనిమిది సాంకేతిక పరిశోధనాశాలలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.

ఈ ల్యాబ్‌లో భాగంగా సామ్సంగ్ ఆర్ అండ్ డి ఇనిస్టిట్యూట్, నోయిడా (SRI-N) లోని ఇంజనీర్లు, కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ విజన్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పై ఆధారపడిన స్మార్ట్‌ఫోన్ డొమెయిన్ల పై డిటియు విద్యార్ధులు మరియు బోధనాసిబ్బందితో సహకారాత్మక పరిశోధనా ప్రాజెక్టుల పై కృషి చేస్తారు. ఇప్పటివరకు, 200 మందికి పైగా విద్యార్ధులు, పరిశోధన ప్రాజెక్టుల పై SRI-N ఇంజనీర్లతో కలిసి పని చేసి, శిక్షణను పొంది ఉన్నారు.

ఈ ప్రాజెక్టుల పై విద్యార్ధులను SRI-N ఇంజనీర్లతో కలిసి కృషి చేసి తమ పరిశోధనా పత్రాలను ప్రచురించేందుకు కూడా ప్రోత్సహించటం జరుగుతుంది.

డిటియు వద్ద సామ్సంగ్ ఇనొవేషన్ ల్యాబ్‌ను ప్రొఫెసర్ యోగేష్ సింగ్, వైస్ ఛాన్స్లర్, డిటియు, శ్రీ క్యుంగ్యున్ రూ, మేనేజింగ్ డైరెక్టర్, SRI-N, ప్రొ. రజనీ జిందల్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిజియు మరియు డిటియులో సామ్సంగ్ ఇనొవేషన్ ల్యాబ్‌కు నేతృత్వం వహిస్తున్న డా. దివ్యశిక్ష సేథియా, ఫాకల్టీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రారంభించారు.

“SRI-Nచాలా ఏళ్ళుగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో కలిసి సహకారాత్మక పరిశోధన ప్రాజెక్టుల కోసం కృషి చేస్తోంది. దీని వలన మేము పటిష్టమైన ఫలితాలను మేము గమనించాము. డిటియు వద్ద కొత్త ల్యాబ్ విషయంలో మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఇక్కడ మా ఇంజనీర్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను గురించి విద్యార్ధులకు బోధించి, వినూత్నమైన ఆవిష్కరణల కోసం కృషి చేసేందుకు విద్యార్ధులకు సహకరిస్తారు. భవిష్యత్తులో విద్యార్ధుల ఉద్యోగసాధనకు ఇది తప్పకుండా వారిని సశక్తులను చేస్తుంది,” అని క్యుంగ్యున్ రూ, మేనేజింగ్ డైరెక్టర్, సామ్సంగ్ ఆర్ అండ్ డి ఇనిస్టిట్యూట్, నోయిడా, అన్నారు.

“టుగెదర్ ఫర్ టుమారో యొక్క మా పౌరసత్వ విజన్‌లో అంతర్భాగంగా సామ్సంగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత, మెరుగైన విద్య మరియు లెర్నింగ్ అవకాశాలను అందుకోగలిగేందుకు సహాయపడుతుంది. ప్రజలకు సాధించే అవకాశాన్ని కలిగిస్తుంది. సామ్సంగ్ ఇనొవేషన్ క్యాంపస్ కార్యక్రమంలో అంతర్భాగంమైన డిటియులోని కొత్త ల్యాబ్, డిజిటల్ సాంకేతికపరిజ్ఞానాల్లో పెరుగుతున్న అవకాశాలను విద్యార్ధులు అందిపుచ్చుకునేందుకు సహాయపడుతుంది. అంతే కాక, పవరింగ్ డిజిటల్ ఇండియా అనే సామ్సంగ్ సిద్ధాంతం దిశలో వారి నైపుణ్యాలను సానపట్టేందుకు దోహదం చేస్తుంది,” అని పార్థ ఘోష్, వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ సిటిజన్‌షిప్, సామ్సంగ్ ఇండియా అన్నారు.

“సామ్సంగ్ ఇనొవేషన్ క్యాంపస్ ఒక గొప్ప కార్యక్రమం. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాల కోసం అంకితం కావించబడిన ఒక ల్యాబ్‌ను ఈ కార్యక్రమం అంతర్జాతీయంగా సాంకేతికపరిజ్ఞానంలో అగ్రగామి అయిన ఒక సంస్థ సామ్‌సంగ్‌ను మరియు డిటియుని ఒక చోటుకు చేరుస్తుంది. డిటియులో అత్యంత మేథావులైన విద్యార్ధులు ఉన్నారు. వారికి సవాళ్ళను ఎదుర్కొని, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అంటే ఎంతో ఇష్టం. ఇటువంటి కార్యక్రమాలు విద్యారంగానికి మరియు పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి, పరస్పర లాభాన్ని కలిగించగలిగేట్లు మరిన్ని సహాయసహకారాలను అందించుకునేందుకు సహకరిస్తాయి. ఈ కొత్త ల్యాబ్, మా అధునాతన పరిజ్ఞానాల్లో కొన్నింటిని గురించి మా విద్యార్ధులకు లోతైన అవగాహనను కలిగించేందుకు, సామ్సంగ్ ఇంజనీర్లతో వారు కలిసి సంయుక్తంగా కృషి చేసేందుకు, తద్వారా తాజా ఆలోచనలను ఆ ప్రాజెక్టులకు అందజేసేందుకు, అమూల్యమైన పరిశ్రమ అనుభవాన్ని సాధించగలిగేందుకు, తమ పరిధులను విస్తరింపజేసుకోగలిగేందుకు దోహదం చేస్తుంది,” అని ప్రొఫెసర్ యోగేషన్ సింగ్, వైస్‌ఛాన్సలర్, డిటియు అన్నారు.

సామ్సంగ్ ఇంజనీర్లు మరియు విద్యార్ధులు, సమాజానికి లబ్దిని కలిగించగలిగే విధంగా నిజజీవితసమస్యలకు పరిష్కారాలను అందించే పలు వినూత్నమైన, సుస్థిరమైన పరిశోధన ప్రాజెక్టుల పై కూడా కృషి చేస్తారు.

సహకారాత్మక పరిశోధనా ప్రాజెక్టులు డిటియు లోని బి.టెక్, ఎం.టెక్ మరియు పిహెచ్.డి విద్యార్ధులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ప్రాజెక్టు చివర్లో వీరికి వారు చేసిన కృషికిగాను సర్టిఫికెట్లు లభిస్తాయి.

ఈ ల్యాబ్‌లో అంతర్భాగంగా, SRI-N ఇంజనీర్లు, అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్, మల్టీమీడియా, ఆరోగ్యం మరియు భద్రత వంటి స్మార్ట్‌ఫోన్ డొమెయిన్ల పై అధునాతన సాంకేతికపరిజ్ఞాన రంగాలైన కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ విజన్ వంటి వాటిపై కూడా డిటియు విద్యార్ధులకు శిక్షణను ఇస్తారు.

అధునాతన సాంకేతికపరిజ్ఞానం పై విద్యార్ధులకు నైపుణ్యాన్ని కలిగించటం ద్వారా దేశంలో నైపుణ్య లోపాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన కంపెనీ వారి అంతర్జాతీయ పౌరసత్వ కార్యక్రమం, ఈ సామ్సంగ్ ఇనొవేషన్ క్యాంపస్. సామ్సంగ్ ఇప్పటివరకు ఐఐటి-ఢిల్లీ, ఐఐటి-కాన్పూర్, ఐఐటి-హైదరాబాద్, ఐఐటి-ఖరగ్‌పూర్, ఐఐటి-రూర్కీ మరియు ఐఐటి-గువాహటి మరియు ఐఐటి-జోధ్పూర్లలో, సామ్సంగ్ ఇనొవేషన్ క్యాంపస్ ప్రోగ్రామ్‌లో అంతర్భాగంగా, ఏడు సామ్సంగ్ ఇనొవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ ల్యాబ్‌లు 1,000కి పైగా విద్యార్ధులకు శిక్షణను ఇచ్చాయి.

సామ్సంగ్ ఇండియా న్యూస్‌రూమ్ లింక్ :

శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్‌ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్‌లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్‌రూమ్ భారత్‌ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s