డిస్నీ+ హాట్‌స్టార్‌లో మొట్టమొదటిసారిగా, డిస్నీ+ ఒరిజినల్ ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్స్

డిస్నీ+ హాట్‌స్టార్‌లో మొట్టమొదటిసారిగా, డిస్నీ+ ఒరిజినల్ ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్స్ నాలుగు భాషలు- హిందీ, తమిళం, తెలుగు & ఇంగ్లీష్‌లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది!

ఈ అద్భుతమైన మార్వెల్ స్టూడియోస్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం చందాదారులకు 4 భాషల్లో మరియు డిస్నీ హాట్‌స్టార్ విఐపి చందాదారులకు హిందీ, తమిళం & తెలుగు భాషలలో వీక్షణకు అందుబాటులో ఉంటుంది ~

ముంబయి, 09 మార్చి 2021: మార్వెల్ స్టూడియోస్ వారి వాండావిజన్, డిస్నీ+ హాట్‌స్టార్ ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వీక్షణ అనుభవాన్ని మరో స్థాయికి తోడ్కొని వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించింది. ది ఫాల్కన్ మరియు ది వింటర్ సోల్జర్ విడుదలతో, ప్రేక్షకులు హై-ఆక్టేన్ యాక్షన్‌ను తమకు తెలిసిన భాషలైన ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో, అద్భుతమైన విజువల్స్ మరియు ఆకట్టుకునే కథను ఆస్వాదించేందుకు అవకాశం వచ్చింది. కెప్టెన్ అమెరికా కవచానికి వారసత్వానికి సాక్ష్యంగా నిలిచేందుకు మరియు ది ఫాల్కన్ మరియు ది వింటర్ సోల్జర్ అద్భుతమైన ద్వయం చేసే గ్లోబల్ అడ్వెంచర్లను వీక్షించండి మరియు వారి సహనంతో పాటు- వారి సామర్థ్యాలను పరీక్షించండి. భారీ స్థాయిలో ప్రేక్షకులు వేచి చూస్తున్న ఈ సిరీస్‌ను అంతర్జాతీయంగా ప్రీమియర్ విడుదలైన రోజే వీక్షించండి.

ఉత్కంఠ రేకెత్తించిన ఎండ్ ఆఫ్ ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ తరువాత సామ్ విల్సన్ అకా ది ఫాల్కన్ (ఆంథోనీ మాకీ) మరియు బకీ బార్నెస్ అకా ది వింటర్ సోల్జర్ (సెబాస్టియన్ స్టాన్) ఇప్పుడు గ్లోబ్-ట్రోటింగ్ థ్రిల్లర్‌లో జతకడుతుండగా, ఇది మార్వెల్ అభిమానులను మరియు మొదటిసారి వీక్షకులను సీట్ల చివరిలో కూర్చుని ఉత్కంఠగా వీక్షించేలా చేస్తుంది. ప్రధాన రచయిత మాల్కం స్పెల్‌మన్‌తో కలిసి కారి స్కోగ్లాండ్ దర్శకత్వం వహించిన ఈ ఆరు-ఎపిసోడ్ల సిరీస్‌లో షరోన్ కార్టర్‌గా ఎమిలీ వాన్‌క్యాంప్, జెమోగా డేనియల్ బ్రహ్ల్ మరియు జాన్ వాకర్‌గా వ్యాట్ రస్సెల్ నటించారు.

డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంలో డిస్నీ+ ఒరిజినల్స్, తాజా అమెరికన్ షోలు, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ సినిమాలు మరియు హెచ్‌బిఓ, ఫాక్స్, షోటైం తదితరాలతో పాటు అంతర్జాతీయ స్టూడియోల నుండి అవార్డు గెలుచుకున్న కంటెంట్‌తో సహా పెద్ద సంఖ్యలో ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నాయి! డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి ప్రపంచంలోని ఉత్తమ కథలు మరియు లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ అన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు సరిసాటి లేని మేటి వినోద అనుభవాన్ని అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి వార్షిక సభ్యత్వంతో, ప్రేక్షకులు మెగా బ్లాక్‌బస్టర్ చిత్రాలైన లక్ష్మి, దిల్ బెచారా, లూట్‌కేస్ తదితరాలను హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో డబ్ చేయబడిన ప్రపంచంలోని ఉత్తమ చలనచిత్రాలు మరియు షోలు ప్రదర్శనలతో పాటు సూపర్ హీరోల చిత్రాలు (ఎవెంజర్స్: ఎండ్ గేమ్, ఐరన్ మ్యాన్ 3), తాజా యానిమేటెడ్ చిత్రాలు (ఫ్రోజెన్ 2, సోల్), బాలలకు అభిమాన పాత్రలు (మిక్కీ మౌస్, డోరెమాన్), ప్రత్యేకమైన హాట్‌స్టార్ స్పెషల్స్ షోలను ఏడు భాషలలో, భారీ ప్రాచుర్యం పొందిన క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్, స్పెషల్ ఆప్స్, ఆర్య, అవుట్ ఆఫ్ లవ్, హోస్టేజెస్ తదితరాలను వీక్షించవచ్చు!

హిందీ ట్రైలర్‌ను ఇక్కడ వీక్షించండి – https://youtu.be/afEQCyB7erQ

తమిళ ట్రైలర్‌ను ఇక్కడ వీక్షించండి- https://youtu.be/PSu9DdgaV2I

తెలుగు ట్రైలర్‌ను ఇక్కడ వీక్షించండి-

ఈ మార్చి 19వ తేదీన, ది ఫాల్కన్ మరియు ది వింటర్ సోల్జర్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం చందాదారుల కోసం ఇంగ్లీషులో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి మరియు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం చందాదారులకు హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలవుతుంది!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s