UPI వ్యాపార లావాదేవీలలో అతిపెద్ద సేవా సంస్థగా PhonePe

UPI వ్యాపార లావాదేవీలలో అతిపెద్ద సేవా సంస్థగా PhonePe మొత్తం UPI P2M మార్కెట్లో 42% పైగా వాటా

 India, 2021:  మొత్తం మార్కెట్లో 42% పైగా వాటాను సాధించడం ద్వారా UPI వ్యాపార (P2M) లావాదేవీల్లో తాము అతి పెద్ద సేవా సంస్థగా అవతరించామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe ప్రకటించింది. ఇటీవలే UPI, వాలెట్, క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డులన్నిటిలో కలిపి 1.07 బిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా అతిపెద్ద డిజిటల్ పేమెంట్ల వేదికగా కూడా PhonePe అవతరించింది. ఈ అసాధారణ వృద్ధి 4,5,6 శ్రేణి పట్టణాలు మరియు తాలూకాలలో కనిపిస్తున్న భారీ స్థాయి స్వీకరణ మరియు ఈ భౌగోళిక ప్రదేశాల్లో వ్యాపారుల స్వీకరణను ముందుకు నడపడంపై దృష్టి కేంద్రీకరించడం వల్లే ఇది సాధ్యపడిందని కంపెనీ తెలిపింది. నేడు దేశంలోని 18 మిలియన్ కిరాణా దుకాణాల్లో అంగీకరించబడుతోంది. కంపెనీ వ్యాపారస్తుల స్వీకరణ నెట్‌వర్క్‌ను ముందుకు నడిపేందుకు 50,000 మంది  దృఢమైన క్షేత్ర స్థాయి సిబ్బంది కలసి పని చేస్తున్నారు.  18 మిలియన్లకు పైగా వ్యాపారులు ఇప్పటికే PhonePe Business యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది వారికి తక్షణ పేమెంట్ ధృవీకరణలు, రశీదులు మరియు సయోధ్య మొదలుకొని పేమెంట్ ప్రక్రియ యొక్క చివరి స్థాయి వరకు నియంత్రణను అందిస్తుంది. PhonePe 11 స్థానిక భాషలలో కూడా వాయిస్ నోటిఫికేషన్‌లను ఉచితంగా అందిస్తుంది. తద్వారా వినియోగదారుడి ఫోన్ స్క్రీన్‌ను చెక్ చేయడం లేదా బ్యాంక్ సందేశం కోసం వ్యాపారి వేచి ఉండడం అవసరం లేకనే కస్టమర్ నుండి అందుకున్న మొత్తాన్ని ప్రకటించడం ద్వారా రద్దీ వ్యాపార వేళల్లో వ్యాపారులకు సహాయపడుతుంది. ఈ మైలురాయిని చేరుకోవడంపై PhonePe ఆఫ్‌లైన్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ వివేక్ లోచెబ్  వ్యాఖ్యానిస్తూ, “ UPI వ్యాపారి లావాదేవీల్లో అగ్రస్థానంలో నిలవడం మాకెంతో ఆనందంగా ఉంది. విశ్వసనీయత మరియు అత్యధిక లావాదేవీలు విజయవంతం అయ్యేలా చేయడంపై నిరంతరం దృష్టి కేంద్రీకరించడం PhonePe వేదికపై గట్టి నమ్మకాన్ని కలుగజేసింది. దాంతోపాటు మెరుగైన ఉత్పత్తి అనుభవం వల్ల వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌లకన్నా PhonePeవైపే మొగ్గు చూపుతుండడం క్రమంగా పెరుగుతోంది. చిన్న పట్టణాలలోనూ మా వేదికను ఎక్కువ మంది వ్యాపారులు ఉపయోగించుకుంటుండడం ద్వారా మార్కెట్ విస్తరించడమే P2M రంగంలో మేము అగ్ర స్థానంలో నిలవడానికి కారణమైంది.’’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s