‘Run for a Girl Child’ run on March 21 in Gatchibauli

సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 21 న జరగనున్న ‘ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ‘ 2021, 5కే / 10కె / 21కే 5వ ఎడిషన్ సన్నాహక పోస్టర్ ను అపోలో హాస్పటల్స్ జాయింట్ మైనేజింగ్ డైరెక్టర్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సంగీత రెడ్డీ మంగళవారం జూబ్లీహిల్స్ లో ఆవిష్కరించారు.

Run for a girl child

ఈ సందర్భంగా డాక్టర్ సంగీత రెడ్డి, 5500 మంది బాలికలను విద్య, జీవిత నైపుణ్యాలు, కౌన్సెలింగ్‌తో సాధికారత పై శిక్షణ ఇస్తున్ సేవా భారతిని ఆమె అభినందించారు. ఈ రన్ విజయవంతం కావాలని, పది వేల మందికి ఈ శక్షణ చేరుకోవాలని, ఇందుకు తన ప్రోతాహం, సహకారం ఉంటుందని సంగీతారెడ్డి వెల్లడించారు.

కిషోర్ వికాస్ (బాలిక సాధికారత) పై అవగాహన కల్పించేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం లో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ‘ రన్ ను నిర్వహిస్తున్నట్టు గర్ల్ ఎంపవర్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ జయప్రద, సేవా భారతి రాష్ట్ర యూనిట్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత లు తెలిపారు.
మురికివాడలు మరియు బస్తీలలోని ఆడపిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి మరియు వృత్తి మార్గదర్శకత్వం అందించడానికి సేవా భారతి 250 కిషోర్ వికాస్ కేంద్రాలను నిర్వహిస్తోం దని, బోయిన్ పల్లి , కూకపట్పల్లి లో ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తూ, వారి ఉపాధికి తోడ్పడుతుందని డాక్టర్ సుమలత తెలిపారు.
ఐటి విభాగం, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, స్వచంద సంస్థలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని, కోవిడ్ నిబంధనలతో కొనసాగతుందని, ఫ్రీడమ్ ఆయిల్ మరియు గ్లోబల్ డేటా మరియు FICCI, ETO, Avineon, ACS, Capgemini, GEP, Genpact, Yash Technologies, Cotivity, Maha Cements, Gati, ITelligence మరియు అనేక ఇతర సంస్థలు కూడా పాల్గొంటున్నాయని వారు వివరించారు..
పోస్టర్ ఆవిష్కరణలో డాక్టర్ సంగీత రెడ్డితో పాటు ఫ్రీడం ఆయిల్‌కు చెందిన మేఘా సోని, గ్లోబల్ డేటా ప్రసన్న, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s