నాయకత్వ మార్పును వెల్లడించిన కెనాన్‌

Canon ceo

ఇండియా నూతన అధ్యక్షుడు మరియు సీఈవోగా మనాబు యమజకి నియామకం
భారతదేశపు మార్కెట్‌లో వృద్ధికి 9 సంవత్సరాల పాటు నేతృత్వం వహించిన శ్రీ కజుటాడా కోబయాషీ నుంచి అధికారాన్ని శ్రీ మనాబు యమజకి స్వీకరించనున్నారు

ఇమేజింగ్‌ సాంకేతికతలలో అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిచిన కెనాన్‌ ఇండియా నేడు శ్రీ మనాబు యమజకిని కెనాన్‌ ఇండియా నూతన అధ్యక్షుడు మరియు సీఈవోగా ఏప్రిల్‌ 01,2021 వ తేదీ నుంచి నియమించినట్లు వెల్లడించింది.
తన నూతన బాధ్యతలలో భాగంగా శ్రీ యమజకి , కెనాన్‌ యొక్క వ్యాపార వ్యూహాలకు మరియు భారతదేశంలో కార్యకలాపాలకూ నేతృత్వం వహించనున్నారు. ఈ నూతన బాధ్యతలకు మునుపు ఆయన తూర్పు చైనాలో బ్రాండ్‌కు చీఫ్‌ రీజనల్‌ ఆఫీసర్‌గా విధులను నిర్వహించారు. ఏపీఏసీ ప్రాంతంలో పలు కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించారు. కెనాన్‌తో 1989 నుంచి శ్రీ యమజకి కి అనుబంధం ఉంది. యూరోపియన్‌, మిడిల్‌ ఈస్ట్రన్‌, రష్యా, ఆఫ్రికా మార్కెట్‌ల వ్యాప్తంగా అత్యుత్తమ వ్యాపార నిర్వహణకు గణనీయమైన తోడ్పాటును అందించారు.
తన అపాయింట్‌మెంట్‌ గురించి నూతనంగా నియమించబడిన అధ్యక్షుడు మరియు సీఈవో శ్రీ మనాబు యమజకి మాట్లాడుతూ ‘‘కెనాన్‌ ఇండియాలో చేరడం పట్ల పూర్తి ఆనందంగా ఉన్నాను. ఇక్కడ ఉన్న అత్యంత ప్రతిభావంతులైన బృందంతో సన్నిహితంగా కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియాలో వ్యవస్థాపకత కూడా అదే స్థాయిలో వృద్ధి చెందుతుంది మరియు నూతన సృజనాత్మక మార్గాలను అన్వేషించేందుకు అపారమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. కెనాన్‌ వద్ద తాము భారతీయ మార్కెట్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నాము. విజయం మరియు ఆవిష్కరణల ట్రాక్‌రికార్డ్‌ను మరింతగా విస్తృతపరిచేందుకు మరియు వాటాదారులకు మరింత విలువను అందించడాన్ని కొనసాగించనున్నాం. విస్తృత స్ధాయి చేరిక మరియు వైవిధ్యతను పరిగణలోకి తీసుకుని, ఉత్పత్తి ప్రతిపాదనలను విస్తరించడం కొనసాగించడంతో పాటుగా దేశవ్యాప్తంగా విభిన్నప్రాంతాలలో విస్తరించేందుకు ప్రయత్నించనున్నాం’’ అని అన్నారు.
సీజన్డ్‌ లీడర్‌, శ్రీ యమజకి తన కెరీర్‌ వ్యాప్తంగా బహుళ పాత్రలను పోషించారు. కెనాన్‌ ఇండియాకు వ్యూహాత్మక కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించడంతో పాటుగా ప్రస్తుత కీలక వ్యాపారాలను బలోపేతం చేసుకునే లక్ష్యమూ ఆయన తీసుకున్నారు మరియు భారతదేశంలో నూతన బహుళ విభాగాలలో బ్రాండ్‌ యొక్క ఇమేజింగ్‌ నైపుణ్యంలో వృద్ధినీ వేగవంతం చేయనున్నారు.
మహామ్మారి వేళ, సంక్షోభంలో సైతం కెనాన్‌ తన నాయకత్వ పాత్రను పోషిస్తూ మారుతున్న వినియోగదారుల అవసరాలను స్వీకరించడంతో పాటుగా తమ వినియోగదారుల సేవలను తరువాత దశకు తీసుకువెళ్లాయి. మహమ్మారి కారణంగా ఎదురైన సంక్షోభాన్ని కెనాన్‌ విజయవంతంగా ఎదుర్కొంది. కెనాన్‌ స్థిరంగా నూతన ఉత్పత్తులను తమ పోర్ట్‌ఫోలియోకు జోడించడంతో పాటుగా గత సంవత్సర కాలంగా తమ ప్రాంతీయ ఔట్‌లెట్లను సైతం విస్తరించింది. ఇమేజింగ్‌ పరిశ్రమలో అగ్రగామిగా బ్రాండ్లలో ఒకటిగా నిలిచిన కెనాన్‌, జీవితకాలం పాటు గుర్తుండి పోయే మధురక్షణాలను సృష్టించుకోవడంలో వినియోగదారులకు సహాయపడుతుంది మరియు వినియోగదారులు తమ వ్యాపార మౌలిక వసతులు సరళీకృతం చేసుకోవడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s