మావోయిస్ట్ కమాండర్ హిడ్మాను చరిత్రలో కలిపేస్తాం

CRPF Director general

నక్సల్స్ తప్పించుకోవడం అసాధ్యమని, ఈ సంవత్సరం చివరిలోపు వారి కథ ముగిస్తామని సీఆర్ఫీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ అన్నారు. ఛత్తీస్ గడ్ అడవుల్లో జవానులను చంపి నెత్తురు పారించిన నక్సల్స్ కమాండర్ హిడ్తా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని అన్నారు. హిడ్మా విషయంలో చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ ఫలితం గురించి ఆయన నర్మగర్భంగా చెప్పారు నక్సల్బపై పోరు మరింత ఉద్ధృతం చేస్తున్నామని, మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని, అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఒక సంవత్సరంలోపే పూర్తి చేస్తామన్నారు

సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని, అతను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మా నే నిందితుడు. తాజా ఎన్ కౌంటర్లో అతడు వేసిన వ్యూహంలో బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్గీప్ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉండేవని అన్నారు. ఈ ఘటనలో నక్సల్స్ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్ ట్రాక్టర్లను వినియోగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు తెలిపారు. నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని, బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సమాచారం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమని వారి బలిదానాలు మాత్రం వృధా కావన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s