Vivo IPL-inspired thriller with the release of the video anthem ‘India Ki Vibe Alag Hai’ from Disney + Hotstar VIP

Vivo ipl

ఎనిమిది భాషల్లో పాటలు కలిగిన గీతాన్ని స్థానిక కళాకారులు ఆలపించారు మరియు వీడియోను వివో ఐపిఎల్ 2021 ఆడుతున్న ప్రతి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ 8 నగరాల్లో చిత్రీకరించారు~

ప్రతి నగరంలోని అభిమానులు విభిన్న వైబ్‌ల ద్వారా వేడుక చేసుకున్నప్పటికీ వారందరినీ క్రికెట్ ఒక్క తాటిపైకి తీసుకు వచ్చింది
ఈ గీతాన్ని ఇక్కడ వీక్షించండి: Vibe Alag Hai

ఈ వివో ఐపిఎల్ 2021కి, డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి క్రికెట్ అభిమానులకు ఆటను ఆనందించేందుకు నూతన కారణాన్ని అందిస్తుండగా, ఇది పలు భాషల గీతం ‘ఇండియా కీ వైబ్ అలగ్ హై’ విడుదల చేసింది. భారతదేశపు వైవిధ్యమయ సంస్కృతికి అద్దం పట్టే ఈ ఏడాది టోర్నమెంట్ ప్రారంభాన్ని చక్కని సందడితో ప్రారంభిస్తున్న ఈ లీగ్ మరోసారి తమకు అత్యంత ప్రీతిపాత్రమైన జట్లకు అభిమానులు ఉత్సాహాన్ని నింపడాన్ని చూడనుంది. ఈ ఇంటర్-సిటీ శతృత్వం మరియు స్నేహపూరిత క్షణాలను బంధించే ఈ గీతం క్రికెట్ అభిమానులకు పలు భావనలైన ప్రైడ్, దుఖం, సంతోషం మరియు సంభ్రమాచరణలకు సంకేతంగా నిలుస్తుంది! భారతదేశపు అత్యంత ప్రియమైన మరియు సంచలనాత్మక సంగీతకారుడు న్యూక్లియా సంయోజించిన ఈ గీతం 8 భారతీయ భాషల సొగసును కలిగి ఉంది మరియు 8 మంది ర్యాపర్లయిన డీ ఎంసి, ర్యాక్, జె19 స్క్వాడ్, సత్యుమ్, వితికా శెరు, మహర్య, గుబ్బి మరియు రావల్ ఆలపించగా, ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన నగరానికి ప్రాతినిథ్యం వహిస్తూ, తమ ప్రత్యేక స్థానిక చమత్కారాన్ని చూపించారు.

భారతీయులు తమను తాము అభివ్యక్తీకరించేందుకు నృత్యాన్ని తమలో అవిభాజ్యం అంగంగా చేసుకున్నారని అర్థం చేసుకున్న ఈ విడియో ప్రతి జట్టు భావనకు పోటీల నుంచి భారీ క్షణాలను స్మరించుకుని, దాని ప్రముఖ అంశాన్ని చాటి చెప్పడంలో న్యాయాన్ని అందిస్తుంది. ఈ వీడియోను 8 వివిధ నగరాల్లో చిత్రీకరించారు మరియు ఈ గీతం లీగ్‌తో ఉండే వినోదాన్ని, అయితే పోటీతో కూడిన స్ఫూర్తిని బంధిస్తుంది. దానితో అది ఢిల్లీలో శిఖర్ ధవన్ ‘గబ్రు స్టెప్’ అయినా, లేదా ముంబయిలో కిరోన్ పొల్లార్డ్ గెలుపు సంకేతమైన ‘చేతులను తిప్పడం అయినా’ ఈ టోర్నమెంట్‌లో ప్రతి ఉన్నత క్షణానికి ఒక నృత్యం ఉంది. అభిమానులు పంజాబ్ సూపర్ ఆటగాడు గేల్ ప్రదర్శించే ‘క్రాడల్ మూవ్’కు చేరవచ్చు మరియు చెన్నై బ్రేవో ‘ఛాంపియ్ డ్యాన్స్’ ఆస్వాదించవచ్చు, జోఫ్రా ఆర్చర్ ‘కాల్ మి మేబి’ నృత్యం రాజస్థాన్‌ను సమ్మోహితపరచనుంది. వేగం నింపుకున్న హైదరాబాద్ ఇప్పుడు రషీద్ ఖాన్ ‘ఫింగర్ రొటేషన్’ చలనాన్ని వేడుక చేసుకుంటుంది, ఆండ్రె రసెల్‌తో కోల్‌కతా ఖ్యాతి పొందిన ‘ఆర్మ్ థ్రస్టింగ్’ మరియు విరాట్ తరహాలో బెంగళూరు ‘బ్లోయింగ్ ఏ కిస్’; దేశ వ్యాప్తంగా అభిమానులు తమకు అత్యంత ఇష్టమైన జట్లకు మద్దతు ఇస్తూ ఈ ఎలక్ట్రిఫైయింగ్ గీతానికి నృత్యం చేయడాన్ని అభిమానులను అడ్డుకోవడం సాధ్యం కాదు.

ఈ గీతం గురించి సంగీయ సంయోజనకారుడు న్యూక్లియా మాట్లాడుతూ ‘‘పలు సంవత్సరాల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లక్షలాది మంది భారతీయులకు ఉత్సాహం మరియు సంతోషాన్ని అందిస్తూ వచ్చింది. జట్లు వారి గెలుపులో లేదా ఓటమిలో మద్దతు అందించ ఆకాంక్ష వాస్తవానికి అద్భుతమైనది! ఈ గీతం ఆ ప్రేమ మరియు పోటీతో కూడిన స్ఫూర్తికి గౌరవంగా నిలుస్తుంది. ‘ఇండియా కీ వైబ్ అలగ్ హై’ ప్రతి నగరపు ప్రవర్తనను బంధిస్తుంది, అయిదే అభిమానులు అందరిలో క్రికెట్‌పై ప్రేమను పంచుకోవడాన్ని ప్రదర్శిస్తుంది. మొట్టమొదటిసారిగా నేను 8 భాషల్లో గీతాన్ని సృష్టించాను మరియు వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిభావంతులతో కలిసి పని చేశాను. ఈ ఏడాది వివో ఐపిఎల్ 2021 కచ్చితంగా సంపూర్ణ మనోరంజన అనుభవంతో ఆల్-రౌండ్ అనుభవాన్ని తోడ్కొని రానుందని’’ పేర్కొన్నారు.

ఏప్రిల్ 9, 2021న ప్రారంభమయ్యే వివో ఐపిఎల్ 2021 అన్ని లైవ్ మ్యాచ్‌లకు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి (12 నెలలకు రూ.399/-) మరియు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం (12 నెలలకు రూ.1499-) నూతన మరియు ప్రస్తుత చందాదారులకు అందుబాటులో ఉంటుంది. అభిమానులు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బంగ్లా, మలయాళంతో కలిసి 8 భాషల్లో కామెంటరీని ఆలకించవచ్చు మరియు మరాఠీలో ప్రత్యేక ఫీడ్ అందుబాటులో ఉంటుంది. దేశాన్ని క్రికెట్ జ్వరం ఆవరిస్తున్నప్పుడే డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి ఏడాదిలో కొన్ని అత్యంత నిరీక్షణల టైటిల్స్‌ను అందిస్తుండగా, అందులో మెగా బ్లాక్ బస్టర్ చిత్రాలను నేరుగా విడుదల చేస్తుంది (ది బిగ్ బుల్, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా), అత్యుత్తమ గ్లోబల్ చలన చిత్రాలు మరియు షోలు (ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్), హిందీ, తమిళం మరియు తెలుగులో డబ్ అయి అందుబాటులో ఉన్నాయి. రానున్న ప్రత్యేక హాట్‌స్టార్ స్పెషల్ షోలు (స్పెషల్ ఆప్స్ 1.5, ఆర్య సీజన్ 2) ఏడు భాషల్లో మరియు ఇంకెన్నో షోలు అందుబాటులో ఉన్నాయి; ఇది ఏడాది మొత్తం నాణ్యతతో కూడిన మనోరంజన భరోసాను ఇస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s