B2B eCommerce enables MSMEs to streamline GST complianceThe point of how to make it possible

బెంగుళూరు, ఏప్రిల్, 2021:అత్యంత చారిత్రాత్మకమైన మరియు గణనీయమైన పన్ను సంస్కరణల్లో ఒకటిగా కొనియాడబడే సరుకులు మరియు సేవల పన్ను (జిఎస్¬టి), జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశం కోసం ఒక సింగిల్ అప్రత్యక్ష పన్నుగా రూపొందించబడిన జిఎస్¬టి, పలు డొమెస్టిక్ అప్రత్యక్ష పన్నులైన వ్యాట్(విఎటి), ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ పన్ను వంటి వాటి స్థానంలో అమల్లోకి వచ్చి – ఒక దేశం, ఒక పన్ను – అనే పన్ను విప్లవానన్ని తీసుకువచ్చింది.

2017లో అమలు చేయబడిన నాటి నుండి జిఎస్¬టి పలు సవరణలను చవిచూసింది. నేటికి కూడా జిఎస్¬టి అనుపాలనను జరిపేందుకు వ్యాపారసంస్థలు చాలా కష్టపడవలసి వస్తోంది. అయితే, జిఎస్¬టి ఫైల్ చేసే ప్రక్రియను సరళీకరించేందుకు, ఎంఎస్ఎంఇల అనుపాలనాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలను తీసుకుంటోంది. దీనిని సరళీకరించి, డిజిటల్ ఇండియా స్ఫూర్తిని అనుగుణంగా ఉంచాలన్నదే దీని వెనుక ఉద్దేశ్యం.

జిఎస్¬టి పరిధిలో రిజిస్టర్ అయిన అందరు పన్ను చెల్లింపుదారులు, నియమనిబంధనలను పాటించవలసి ఉంటుంది. వ్యాపారసంస్థలు జిఎస్¬టి నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నాయో పర్యవేక్షించేందుకు భారతప్రభుత్వం, జిఎస్¬టి పోర్టల్ పై రిజిస్టర్ అయిన వ్యక్తి యొక్క ప్రొఫైల్¬ను ప్రవేశపెట్టి, నిరంతరం ఆ ప్రొఫైల్¬ను అప్¬డేట్ చేస్తోంది. దీనిని PAN లేదా GSTIN లతో తనిఖీ చేయవచ్చు. ఇవ్వబడిన కొన్ని కీలకమైన వివరాలు – రిజిస్ట్రేషన్ యొక్క స్థితి, రిటర్న్ దాఖలు అనుపాలన.

ఇన్వాయిస్¬లు సజావుగా జారీ చేయబడ్డాయని, జిఎస్¬టి రిటర్న్¬లో వరుసక్రమంలో అప్¬లోడ్ చేయబడి, కొనుగోలుదారు క్రెడిట్లను ఉపయోగించుకోవటానికి మరియు ప్రభుత్వం సరియైన పన్నులను పొందేందుకు అనువుగా ఉండేట్లుగా విక్రేత జాగ్రత్త వహించాలి. పన్ను క్రెడిట్ నష్టం ఏమీ లేకుండా ఉండునట్లు ఇన్వాయిస్¬లు సరైన క్రమంలో ఉండేలా ఒక కొనుగోలుదారు జాగ్రత్త వహించాలి.

ఇన్-వర్డ్ మరియు ఔట్¬వర్డ్ సరుకు రవాణాల కోసం, నెలవారి రిటర్న్¬ కోసం వేరు వేరు ఫారాలతో జిఎస్¬టి ప్రారంభమయ్యింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు, రెండు సింగిల్ రిటర్న్¬లను నెలవారి పద్ధతిలో సమర్పిస్తూండాల్సి ఉంది. ఎంఎస్ఎంఇల కోసం అనుపాలనను సరళతరం మరింత సరళం చేసేందుకు, జిఎస్¬టి సమితి కొత్త రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమలును ఆమోదించింది. దీని వలన జనవరి 1, 2021 నుండి, రూ. 5 కోట్ల వరకు వార్షిక సమగ్ర టర్నోవర్ కలిగిన జిఎస్¬టి పన్ను చెల్లింపుదారులు, గతంలో 12 పత్రాలను నింపవలసి ఉండగా, ఇప్పుడు నాలుగు జిఎస్¬టిఆర్ 3బి పత్రాలను నింపవలసి ఉంటుంది.

ఎప్పటికప్పుడు మార్పులను సంతరించుకుంటూ ఆవిర్భవించే తత్వం కారణంగా, ఈ కొత్త చట్టం గురించి, ఆ వ్యవస్థను గురించి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించటం ఒక సవాలు. జిఎస్¬టి అనుపాలనకు సంబంధించి గమనించదగిన కొన్ని అంశాల్లో, ఇన్వాయిస్¬లను అప్పటికప్పుడు అప్¬లోడ్ చేయటం (భారతదేశవ్యాప్తంగా రూ. 50 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఇ-ఇన్వాయిసింగ్), మరియు ఇన్¬పుట్ పన్ను క్రెడిట్ (ఐటిసి)ని క్లెయిమ్ చేసుకునేందుకు చర్యలు. ఇందులో ఇబ్బందిని కలిగిన విషయం ఏమిటంటే, చిన్న వ్యాపార సంస్థలు ఈ కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది లేదా ఈ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా నియోగించిన సిబ్బందిని కలిగి ఉండవలసి ఉంటుంది.

పలు వెండర్లతో లావాదేవీలను నిర్వహించే వ్యాపారసంస్థలు, తమకు ఇన్వాయిస్ లభించిన ప్రతిసారి, తమ జిఎస్¬టి సంఖ్య దాని పై సరిగా ముద్రించబడి ఉండునట్లు జాగ్రత్త వహించాలి. ఇలా జరగని సందర్భాల్లో, ఈ ఇన్వాయిస్¬లు అనుపాలన జరగనివి అయిపోతాయి. అంతే కా, అనుపాలన చేయని వెండర్ల విషయంలో, వ్యాపార సంస్థలు 5 శాతం నుండి 28 శాతం ఇన్¬పుట్ పన్ను క్రెడిట్¬ను నష్టపోయే అవకాశాలుంటాయి. పలువురు వెండర్లతో వ్యవహరించటం వలన, ఫిజికల్ ఇన్వాయిస్¬లతోను మరియు రకరకాల ఫార్మాట్ల ఇన్వాయిస్-లతోనూ వ్యవహరించవలసిన చీకాకు కలిగించే పరిస్థితి కలుగవచ్చు.

అమెజాన్ బిజినెస్ వంటి ఇ-కామర్స్ ప్లాట్¬ఫారంలు ఇలాంటప్పుడే చిన్న మరియు మధ్యతరహా వ్యాపారసంస్థలకు జిఎస్¬టి అనుపాలనా సమస్యలను సరళీకరించుకునేందుకు సహకరించగలుగుతాయి.

తమ వ్యాపారాలను విస్తరింపజేసుకునేందుకు ఎంఎస్ఎంఇలు ఆన్¬లైన్ మార్కెట్¬ప్లేస్¬లకు మారుతున్న తరుణంలో, ఎంఎస్ఎంఇలు జిఎస్¬టి అనుపాలనను చేపట్టే బరువుబాధ్యతలను సరళీకరించేందుకు వారికి అమెజాన్ బిజినెస్ సహకరించగలుగుతుంది. జిఎస్¬టి అనుపాలక ఇన్వాయిస్¬లను ఒక కేంద్రీకృత స్థానంలో పొందగలగటం వలన ఆ ఎంఎస్ఎంఇలు పలు లాభాలను పొందగలుగుతాయి. అంతేకాక, పలువురు సప్లయర్లతో వ్యవహరించేందుకు ఎంఎస్ఎంఇలు వెచ్చించవలసిన సమయాన్ని, వారి శ్రమను తగ్గిస్తుంది.

ఒక కొనుగోలుదారుగా వ్యాపారసంస్థలు తమ జిఎస్¬టి నెంబరును అమెజాన్ బిజినెస్ పై అప్¬డేట్ చేయగానే, ప్రతి ఇన్వాయిస్, వారి జిఎస్¬టి నెంబరును కలిగి ఉంటుంది. దీని వలన, అన్ని ఇన్వాయిస్¬లను వ్యాలిడేట్ చేసేందుకు పట్టే సమయం మరియు కలిగే శ్రమలో చెప్పుకోదగిన తగ్గుదల ఉంటుంది. జిఎస్-టి-అనుపాలక బ్యాడ్జ్¬ కలిగిన లక్షలాది ఉత్పత్తులను అమెజాన్ బిజినెస్ కలిగి ఉంటుంది. ఎంఎస్ఎంఇ కొనుగోలుదారులు కేవలం రిజిస్టర్ అయిన జిఎస్¬టి వెండర్లతో మాత్రమే కనెక్ట్ అయ్యేట్లు చేసేందుకు ఉపయోగపడే జిఎస్¬టి ఫిల్టర్లను కలిగి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు అవాంతరాలు లేకుండా నడిచేందుకు ఇది దోహదం చేస్తుంది. పలువురు వెండర్లతో వ్యవహరించేటప్పుడు వ్యాపారసంస్థల సమయం మరియు శ్రమను ఇది ఆదా చేస్తుంది. జిఎస్¬టి అనుపాలక ఇన్వాయిస్¬లు మరియు వర్తించే ప్రతి చోటా ఇ-వే బిల్లులను కూడా పొందేందుకు సహకరిస్తుంది. అంతేకా, అమెజాన్ బిజినెస్ పై ఇన్వాయిస్¬లు డిజిటల్ మరియు ప్రామాణికమైనవి. ఇందువలన, ఈ వ్యాపార కొనుగోళ్ళ పై మరింత ఎక్కువ ఆదా చేసుకునేందుకు ఇన్-పుట్ పన్ను క్రెడిట్ కోసం వీటిని ఫైల్ చేయటాన్ని సరళతరం చేసింది.

ఒక విక్రేతగా ఎంఎస్ఎంఇలు, అమెజాన్ బిజినెస్ వంటి ఇ-కామర్స్ ప్లాట్¬ఫారం నుండి సేవలను పొంది, పన్ను అనుపాలకమైన ఇన్వాయిస్¬లను అటువంటి ఇ-కామర్స్ వేదికల ద్వారా సృష్టించవచ్చు, ఆయా సమయాలకుగాను నివేదికలను పొందగలుగుతాయి. ఈ నివేదికలు, నెలవారి/త్రైమాస జిఎస్¬టి అనుపాలకాలు మరియు ఆడిట్¬లను చేపట్టేటప్పుడు బాగా ఉపయోగపడతాయి.

2017లో ప్రారంభించబడినప్పటి నుండి, ఎంఎస్ఎంఇల విభిన్నమైన వ్యాపారావసరాలకు తగిన విధంగా ఉపయోగపడేందుకు ఉన్నత క్యాటగిరీల వ్యాప్తంగా 20 కోట్లకు పైగా జిఎస్¬టి సశక్త ఉత్పత్తులతో ఎంఎస్ఎంఇలకు ఒక వన్-స్టాప్ డెస్టినేషన్¬గా మారేందుకుగాను అమెజాన్ బిజినెస్ ఎల్లప్పుడూ ఎంఎస్ఎంఇలను సశక్తీకరించేందుకు ఉద్దేశించినది. అమెజాన్ బిజినెస్ పై బిజినెస్ కస్టమర్లకు విక్రయిస్తున్న 3.7 లక్షల మంది విక్రేతలు ఉన్నారు. విస్తృతశ్రేణి ఉత్పత్తులను అందించటంతో పాటు, అప్రత్యక్ష ఖర్చులను నిర్వహించుకునేందుకు ఎంఎస్ఎంఇలకు సహకరించటం ద్వారా వారు తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు అమెజాన్ బిజినెస్ ఉపయోగపడుతుంది. విశ్వసనీయమైన మరియు అంతర్జాతీయస్థాయి ఫుల్¬ఫిల్¬మెంట్ నెట్¬వర్కును అమెజాన్ అందిస్తున్న కారణంగా మల్టీ-యూజర్ అకౌంట్లు మరియు ఆమోదాలు, ఖర్చు విశ్లేషణలు మరియు సురక్షితమైన మరియు విశ్వసనీయమైన డెలివరీ వంటి ఫీచర్లతో వ్యాపారనిర్వహణ సులభతరం అయ్యి, ఖర్చులు తగ్గుతాయి.

ఎంఎస్ఎంఇకి ఇకామర్స్ ఒక గొప్ప భాగస్వామి. ఎంఎస్ఎంఇలు తమ అప్రత్యక్ష ఖర్చులను మేనేజ్ చేసుకునేందుకు, కొనుగోలును మరింత సౌకర్యవంతంగా చేసేందుకు, జిఎస్¬టి అనుపాలకంగా మారేందుకు, తద్వారా లాభార్జనను మెరుగుచేసుకునేందుకు సహకరించటం ద్వారా, మెల్లమెల్లగా ఇకామర్స్, వారికి బలమైన మద్ధతుగా నిలుస్తోంది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s