నన్నూ అరెస్టు చేయండి, మమత

Mamata , West Bengal, cm,

కోల్‌కతా :  పశ్చిమ్ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్‌ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ రోజు అరెస్టు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ‘నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్టులు జరగలేదు. నన్ను కూడా అరెస్టు చేయండి’ అంటూ ఆమె అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకించారు. సుమారు 45 నిమిషాల పాటు మమత సీబీఐ కార్యాలయం వద్ద ఉన్నారని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు.  అలాగే కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం-దీదీ మధ్య ఢీ అంటే ఢీ వాతావరణం నెలకొని ఉండగా.. తాజా వ్యవహారం అందుకు ఆజ్యం పోసేలా కనిపిస్తోంది.

ఈ ఇద్దరు మంత్రులను సీబీఐ ఈ రోజు ఉదయమే అదుపులోకి తీసుకుంది. వీరితోపాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్‌ సోవన్ ఛటర్జీని కూడా సీబీఐ కార్యాలయానికి తరలించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను సీబీఐ అరెస్టు చేసిందని ఫిర్హాద్ ఆరోపణలు చేశారు. వాటిని తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థ..విచారణ నిమిత్తమే వారిని తీసుకెళ్లినట్లు తెలిపింది. గవర్నర్ జగదీప్‌ ధనకర్ అనుమతి మేరకు వీరిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s