ప్రపంచ చేతి పరిశుభ్రత దినం:

ఆరోగ్యంగా జీవించేందుకు చేతి పరిశుభ్రత గైడ్
‘‘మీ చేతుల్ని కడుక్కోండి”, “మీ చేతులను శానిటైజ్ చేసుకోండి’’ మరియు “భౌతిక దూరాన్ని పాటించండి’’ ఇవే నేడు ఎక్కువగా అందరూ వింటున్న సలహాలు. మునుపు ఎన్నడూ లేని విధంగా నిరుడు పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని చేతులు కడుక్కోవడం, చేతి పరిశుభ్రత ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించారు. పరిశుభ్రత మరియు సురక్షత ఒకే సమయంలో చర్చనీయాంశంగా మరియు ఆందోళనను గుర్తు చేసే అంశాలుగా నిలిచాయి. అలవాట్లలో మార్పు మరియు పరిశుభ్రతను పెంపొందించుకునేలా పరిస్థితులు కల్పించాయి.
వ్యాధులను కలిగించే సూక్ష్మక్రిముల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు మనలో ఎక్కువ మంది సంప్రదాయక విధానంలో సబ్బు మరియు నీటిని వినియోగించుకుని చేతులు కడుక్కుంటుండగా, ఆ విధానంలో చేతులను కడుక్కోవడం సాధ్యం కానప్పుడు కూడ శుభ్రపరచుకోవడం అత్యవసరం. ‘‘సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదాన్ని నియంత్రించేందుకు, మనం చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవడం మరియు శుభ్రపరచుకోవడం అత్యవసరం. ఇది సూక్ష్మక్రిములను నాశనం చేసేందుకు సహాయపడటమే కాకుండా వివిధ మహమ్మారుల విస్తరణను అడ్డుకునేందుకూ సహాయపడుతుంది. కనుక, అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చక్కని చేతి పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి’’ అని హిమాలయ డ్రగ్ కంపెనీ రీసర్చ్ &అభివృద్ధి విభాగంలో ఆయుర్వేద నిపుణురాలు, డా.సుశ్రుత సి.కె. తెలిపారు.
చేతుల్ని ఎప్పుడు కడుక్కోవాలి? మనం ప్రతి రోజూ పలు ఉపరితలాలను స్పర్శిస్తాము. రెస్ట్‌ రూమ్ ఉపయోగించిన తరువాత, తినడానికి లేదా మీ చేతులతో ముఖాన్ని తాకే ముందు, మరియు మీరు మాస్కు ధరించే ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని గుర్తుంచుకోండి.
మీ చేతులను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొందరు నిపుణులు ఇచ్చిన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
• వేడి నీటి వినియోగాన్ని మానుకోండి, ఎందుకంటే ఇది మీ చర్మాన్ని పొడిబారేలే చేస్తుంది. దాని బదులుగా, గోరువెచ్చని నీటితో మీ చేతులను కడుక్కోండి. సూక్ష్మక్రిములకు సంతానోత్పత్తికి అవకాశం ఉండే ప్రాంతాలైన, వేళ్ల మధ్య, మీ చేతుల వెనుక, మణికట్టు మరియు గోర్ల కింద శుభ్రం అయ్యేలా చూసుకోండి.
• స్వచ్ఛమైన మరియు సురక్షితమైన చేతుల కోసం, తులసి, అలోవెరా మరియు నిమ్మవంటి సహజ పదార్ధాల సుగుణంతో తయారైన ఒక లిక్విడ్ హ్యాండ్ వాష్ వాడండి. ఎందుకంటే ఇవి యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిములను వదిలించుకునేందుకు మరియు చర్మానికి పోషణ అందించేందుకు సహాయపడతాయి.
• మీ చేతులను నీటి ధార కింద చక్కగా కడుక్కోండి. సబ్బు అంశాలు పూర్తిగా తొలిగిపోయేలా నిర్ధారించుకోండి. ఎందుకంటే అది చర్మాన్ని చికాకు పరుస్తుంది.
• పరిశుభ్రమైన తువ్వాలు మరియు తాజా టిష్యూస్‌తో మీ చేతులను తుడుచుకోండి. ఇతరులు ఉపయోగించిన తువ్వాలు మరియు టిష్యూస్‌తో మళ్లీ సూక్ష్మక్రిముల వ్యాప్తికి అవకాశం ఉంటుంది.
• ప్రయాణంలో ఉన్నప్పుడు పరిశుభ్రత కోసం శానిటైజర్‌ను తీసుకు వెళ్లడం మంచిది. కొత్తిమీర, ఉసిరి, నట్‌గ్రాస్, వేప, స్పైక్‌డ్ జింజర్ లిల్లీ వంటి సహజ పదార్ధాలతో ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ వాడితే చక్కని ఉపయోగాలు ఉంటాయి. ఈ మూలికలు యాంటీమైక్రోబయాల్ లక్షణాలకు చక్కని గుర్తింపు కలిగి ఉన్నాయి.
• మీ చేతులు శుభ్రంగా మరియు ధూళి లేకుండా ఉంచుకునేందుకు హ్యాండ్ వైప్స్ దగ్గర ఉంచుకోవడం సులభంగా ఉంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట భోజనం చేసేటప్పుడు చేతి వైప్‌ల ప్యాకెట్‌ను తీసుకు వెళ్లండి. దానితో మీ గోర్లు, వేళ్లు మరియు చేతుల సందుల్లో చిక్కుకున్న ఆహార కణాలను శుబ్రం చేసుకునేందుకు ఉపయోగించుకోండి. అలోవెరా, తులసి, నిమ్మకాయ వంటి మూలికల సుగుణాలతో నిండిన వాటి కోసం చూడండి. తులసి అద్భుతమైన యాంటీమైక్రోబయల్ మరియు స్కిన్-డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

అంటువ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత శక్తివంతమైన మార్గాలలో చేతి పరిశుభ్రత పద్ధతులను అనుసరించడం మొదటి స్థానంలో నిలుస్తుంది. చక్కని చేతి పరిశుభ్రతను పాటించడం మీ రక్షణను నిర్ధారించడంతో పాటు మీ చుట్టూ ఉన్న వారికి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు చేతి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో అత్యంత అవసరం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s